Paradise bakery & cafe

Paradise bakery & cafe newly opened cafe with bakery and other snack and food items

04/08/2019
21/04/2019

ఈమధ్య చెన్నై వెళ్ళినప్పుడు కంచికి వెళ్ళి వస్తుండగా బాగా ఆకలివేసి ఓ హోటలు దగ్గరకు వెళ్ళాము. మధ్యాహ్నం సమయం హోటల్ లో భోజనం తయారై వడ్డించడానికి రెడీగా ఉంది. వివిధ రకాల వంటలు వేడి వేడిగా ఉన్నాయి.

బాగా ఆకలిమీద ఉన్న మేము టొమేటోబాత్ తీసుకురమ్మని సర్వర్ కు చెప్పాము. అప్పుడు ఆ హోటల్ మేనేజరు వచ్చి కాసేపు ఆగాలని మర్యాదగా చెప్పాడు. ఎందుకు అని అతన్ని అడిగాము. దానికి అతను ఇలా చెప్పాడు.

" అరటి ఆకులు రావడానికి 10 నిమిషాలు పడుతుంది.అవి రాగానే మీకు
అందులోనే టొమేటోబాత్ ఇస్తాము. దయచేసి ఓపిక పట్టండి " అని
చాలా వినయంగా చెప్పాడు. చిన్న హోటల్ అయినా చాలా శుభ్రంగా
ఉంది. చేసేదేం లేక అలాగే కూర్చున్నాము.

కాసేపటికి అరటి ఆకులు రాగానే మాకు టొమేటోబాత్ సర్వ్ చేశాడు. తింటూ
అతనితో మాటలు కలిపాము.

" అరటి అకులు లేకపోతే ఏమైంది ??? ఇప్పుడంతా ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చాయి కదా!
పైగా అవి రేటు కూడా తక్కువే కదా! మీరు అరటి ఆకులోనే వడ్డిస్తున్నారు.
దానికేమైనా కారణం ఉందా? అని అడిగాము.

" నిజమే! మీరు చెప్పినట్లు ప్లాస్టిఫ్ ప్లేట్లు చాలా చవకే అరటి ఆకులతో పోలిస్తే!
కానీ, ఆ ప్లాస్టిక్ ప్లేట్లల్లో తింటే రకరకాల జబ్బులు వస్తున్నాయని చెపుతున్నారు. నేనేమీ చదువుకోలేదండీ! అన్నీ మంచిగా ఉన్నవి తింటేనే రోగాల బారిన పడుతున్నాము. నా హోటలుకు వచ్చేవారు
ధనవంతులు కాదండీ.....లక్షల్లో రోగాలకు ఖర్చు పెట్టడానికి.
వారు ఆరోగ్యంగా ఉంటేనేకదా మా హోటలుకు వచ్చేది. వారివల్లనే
కదా నా కుటుంబం బ్రతుకుతోంది. కొంతమందికి ఉపాధి కలిగేది వారివల్లనే
కదా! అలాంటప్పుడు నేను నా పదార్థాలను వారికి అరటి ఆకుల్లోనే పెట్టడం
మంచిదనిపించింది. పైగా అరటి ఆకుల్లో వేడి పదార్థాలు పెట్టినప్పుడు ఆ ఆకులోని ఔషధ గుణాలు వారికి మంచి చేస్తాయని విన్నాను.
నాకు ప్లాస్టిక్ ప్లేట్లు వాడితే మహా అంటే 300 మిగులుతాయేమో! కోటీశ్వరుడిని కాలేను కదా! అందుకే కాస్త రేటు ఎక్కువైనా నేను
అరటి అకులే వాడతాను. మీరు బాగుంటేనే నేను బాగుంటాను "అంటూ ఆప్యాయంగా మరింత కొసరి కొసరి వడ్డించాడు.

నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చెడిపోయిన పదార్థాలను కూడా
మంచివాటిలో కలిపేసి ప్లాస్టిక్ ప్లేట్లల్లో వడ్డించే చాలా పెద్ద హోటల్ వాళ్ళు
ఇతని ముందు చాలా చిన్నగా కనిపించారు నాకు. అతని సహ్రుదయానికి
నిజంగా మనస్ఫుర్తిగా అభినందించి సంతృప్తిగా బయటకు వచ్చాము.

ఎంతమంది హోటల్ యజమానులు ఇలా ఆలోచిస్తున్నారు చెప్పండి.
నిజంగా ఆ హోటల్ యజమాని అభినందనీయుడు.

06/04/2019
19/03/2019

ఎంత ఉపయోగమో!?
డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది.
తిండేదైనా ఫోర్క్ పక్కా అయి కూర్చుంది ఈ వేళ..?
హోటల్ లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది.
ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లీదండ్రులు.
దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం.. చేతులు శుభ్రంగా ఉండవు కదా..! అని.
అయితే ఓ సారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను ఓ సారి చూద్దాం.
ఇది చదివాక ఎక్కడున్నా…?
మీరు పద్దతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను
చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు:
( As Per Science)
1.చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.
2.చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయట.
3.అహారాన్ని చేతితో టచ్ చేయగానే, ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది.
4.చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం.
6.మన ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తాం.ఇలా తయారుచేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుందట.
7.వేళ్ళతో ఆహారం కలుపుకొని, ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందట.
8.చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.
9.ఇంకా చేతివేళ్ళతో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలుకాకుండా,ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది. పురణాల పరంగా…
*చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందట.
*బొటనవేలు: అగ్నితత్వం
--------------
చూపుడు వేలు: వాయుతత్వం
--------------
మధ్యవేలు: ఆకాశం
--------------
ఉంగరపు వేలు: భూమి
--------------
చిటికిన వేలు: జలతత్వం..
--------------
ఈ అయిదు వేళ్ళ స్పర్శ ఆహారానికి తగిలినపుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది

29/12/2018

Address

Krishna College Road, Maddilapalem
Visakhapatnam
530013

Opening Hours

Monday 9am - 10pm
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10pm
Thursday 9am - 10pm
Friday 9am - 10pm
Saturday 9am - 10pm
Sunday 9am - 10pm

Telephone

9885036078

Website

Alerts

Be the first to know and let us send you an email when Paradise bakery & cafe posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category